Betting App: బెట్టింగ్ యాప్ కేసు.. ఏపీలో రాజకీయ రంగు

బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేస్తున్నారంటూ తెలుగు రాష్ట్రాల్లో పలువురు యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్​ఫ్లూయన్సర్స్​ పై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.

Update: 2025-03-18 11:31 GMT
Betting App: బెట్టింగ్ యాప్ కేసు.. ఏపీలో రాజకీయ రంగు
  • whatsapp icon

దిశ డైనమిక్ బ్యూరో : బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేస్తున్నారంటూ తెలుగు రాష్ట్రాల్లో పలువురు యూట్యూబర్లు (Youtubers), సోషల్ మీడియా (Social Media) ఇన్​ఫ్లూయన్సర్స్​ పై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న 11 మంది సోషల్ మీడియా ఇన్​ఫ్లూయన్సర్స్ మీద హైదరాబాదులోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు అయ్యాయి. యాంకర్ శ్యామల (Anchor Syamala), విష్ణుప్రియ, సుప్రిత, రీతూ చౌదరి(Reethu Chowdary), హర్షసాయి, టేస్టీ తేజ, పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్, కిరణ్ గౌడ్, అజయ్, సన్నీ(Sunny), సుధీర్ తదితరులపై కేసు నమోదు చేశారు. కేసు నమోదైన ఇన్‌ఫ్లూయెన్సర్లలో చాలా మందికి వైసీపీతో సంబంధాలున్నాయని తీవ్ర విమర్శలు వస్తున్నాయి. జగన్, ఆయన కుటుంబంతో గతంలో దిగిన ఫొటోలను సోషల్ మీడియా వేదికగా కూటమి అభిమానులు పోస్టు చేస్తున్నారు. ఇదే కేసులో ఉన్న రీతు చౌదరిపై గతంలో కూడా పలు ఆరోపణలు వచ్చాయి. వైసీపీ హయాంలో ఓ భూమికి సంబంధించిన కేసులో ఆమెపై తీవ్ర ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. మీకు ఈ కేసులో పలువురు ఏపీకి చెందినవారు ఉన్నారు.

వీరిలో యాంకర్ శ్యామల వైసీపీ అధికార ప్రతినిధిగా పనిచేస్తున్నారు. ఆమె పై బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన కేసు నమోదు కావడంతో ఏపీలో రాజకీయరంగు పులుముకుంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ, అమాయకుల ఉసురు పోసుకుంటూ, కోట్లు సంపాదిస్తున్న వైసీపీ అధికార ప్రతినిధి శ్యామలపై తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారంటూ తెలుగుదేశం పార్టీ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది. శ్యామల బెట్టింగ్ యాప్ ను ప్రమోట్ చేస్తున్న వీడియోను పోస్ట్ చేసింది. బెట్టింగ్‌ యాప్‌ల బారినపడుతున్న బాధితులు అప్పులపాలై, బతుకులు విషాదాంతం చేసుకున్నారంటూ టీడీపీ పేర్కొంది. అదేవిధంగా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన యాంకర్ శ్యామలను వైసీపీ అధికార ప్రతినిధి గా సస్పెండ్ చేయాలంటూ జనసేన నేత కిరణ్ రాయల్ (Kiran Royal) డిమాండ్ చేశారు. బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేసే శ్యామలని ముందు పార్టీ నుంచి సస్పెండ్ చేశాకే వైసీపీ వాళ్లు మాట్లాడాలని సూచించారు. శ్యామల ప్రమోట్ చేస్తున్న బెట్టింగ్ యాప్స్ వల్ల చాలా మంది చనిపోయారు.. ఆమెపై మర్డర్ కేసు కూడా పెట్టాలని డిమాండ్ చేశారు. అసలు శ్యామల అధికార ప్రతినిధి వైసీపీ పార్టీకా లేకపోతే బెట్టింగ్ యాప్స్ కా? అని కిరణ్ రాయల్ ప్రశ్నించారు. ఈ మేరకు వీడియో విడుదల చేశారు.


Read More..

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసున్న తెలుగు హీరో కూతురు.. కేసు నమోదుకు రంగం సిద్ధం చేస్తున్న పోలీసులు?  

Tags:    

Similar News