Vijayasai Reddy ఫోన్ దొరకాలి.. శ్రీవారిని కోరుకున్న టీడీపీ మాజీ మంత్రి

దుర్మార్గుడి పాలన నుంచి రాష్ట్ర ప్రజలను కాపాడాలని తిరుమల శ్రీవారిని కోరుకున్నట్లు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు అన్నారు...

Update: 2022-11-25 12:02 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: దుర్మార్గుడి పాలన నుంచి రాష్ట్ర ప్రజలను కాపాడాలని తిరుమల శ్రీవారిని కోరుకున్నట్లు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు అన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం తిరుమల వెంకటేశ్వరుడిని దర్శించుకున్న ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా స్వామి వారిని రెండు కోరికలు కోరుకున్నట్లు తెలిపారు. దుర్మార్గుడి పాలన నుండి రాష్ట్ర ప్రజలని కాపాడాలని.. పోయిన విజయసాయిరెడ్డి ఫోన్‌ దొరకాలని కోరుకున్నట్లు వెల్లడించారు. విజయసాయిరెడ్డి ఫోన్‌లో ఢిల్లీ లిక్కర్ స్కాం. విశాఖ భూ దోపిడీకి సంబంధించిన ఆధారాలు ఉన్నాయని ఆరోపించారు. ఆధారాలు దొరికితే దోచిన సొమ్ము అంతా జప్తు అవుతాయని.. తిరిగి మళ్ళీ ప్రజలకే ఆ డబ్బు వస్తుంది కాబట్టి ఆ ఫోన్ తొందరగా దొరకాలని స్వామి వారిని వేడుకున్నట్లు అయ్యన్నపాత్రుడు తెలిపారు. 

Pattabhi: సంకల్ప సిద్ధితో కోట్లు కొట్టేశారు.. కొడాలి, వల్లభనేని‌పై సంచలన ఆరోపణలు

Tags:    

Similar News