అరకు ఎమ్మెల్యే, జిల్లా చైర్మన్ ను అడ్డుకున్న గిరిజనులు..
బోయ వాల్మీకిలను ఎస్టీ జాబితాలో చేర్చే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆసరా కార్యక్రమానికి వచ్చిన అరకు ఎమ్మెల్యే పాల్గుణ, జెడ్పీ చైర్ పర్సన్ సుభద్రను గిరిజన సంఘం నాయకులు, ప్రజలు నిలదీశారు.
దిశ, అల్లూరిజిల్లా : బోయ వాల్మీకిలను ఎస్టీ జాబితాలో చేర్చే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆసరా కార్యక్రమానికి వచ్చిన అరకు ఎమ్మెల్యే పాల్గుణ, జెడ్పీ చైర్ పర్సన్ సుభద్రను గిరిజన సంఘం నాయకులు, ప్రజలు నిలదీశారు. అల్లూరి జిల్లా ముంచంగిపుట్టు మెయిన్ రోడ్డు నాలుగు రోడ్ల జంక్షన్ వద్ద గిరిజన సంఘం, ప్రజలు అడ్డుకొని నిలదీసి ప్రశ్నల వర్షం కురిపించారు.
ఎమ్మెల్యే, చైర్మన్ లు, నాయకులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఏజెన్సీ ప్రజలకు ద్రోహం తలపెట్టిన వైసీపీ సర్పంచ్ లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కె నర్సయ్య, లక్మిపురం సర్పంచ్ కె త్రినాధ్, వైస్ ఎంపీపీ, పిబీ సత్యనారాయణ, గిరిజన సంఘం నాయకులు ఎంఎం శ్రీను, పి.భీమరాజు, గాసి రామ్ దొర, రాందాస్, లైకోన్, కె.శ్రీను తదితరులు పాల్గొన్నారు.