ఏపీలో ముగిసిన వైన్ షాపుల దరఖాస్తులు.. 14న లాటరీ

ఏపీలో మద్యం దుకాణాలకు దరఖాస్తుల గడువు ముగిసింది...

Update: 2024-10-11 13:42 GMT

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో మద్యం దుకాణాల(Liquor Stores)కు దరఖాస్తుల గడువు ముగిసింది. 3396 షాపులకు 75 వేల వరకూ దరఖాస్తులు వచ్చాయి. లాటరీ విధానంలో షాపులను కేటాయించనున్నారు. దీంతో దేశ, విదేశాల నుంచి సైతం ఆన్‌లైన్‌లో పలువురు దరఖాస్తులు చేసుకున్నారు. సాయంత్రం 7 గంటలకే ఈ ప్రక్రియ ముగిసింది. అయితే నేరుగా ఎక్సైజ్ కార్యాలయాలకు వెళ్లి దరఖాస్తుల డీడీలు సమర్పించేవారు 7 తర్వాత క్యూ లైన్‌లోఉన్నా శుక్రవారం రాత్రి 12 గంటల వరకూ స్వీకరించనున్నారు. ప్రస్తుతం షాపుల టెండర్ల ప్రక్రియ ముగిసింది. శని, ఆది వారాల్లో దరఖాస్తులు పరిశీలించనున్నారు. 14న లాటరీ తీయనున్నారు. ఈ నెల 16 మద్యం షాపుల ప్రారంభం ఉండనుంది. అయితే అంచనాలకు మించి దరఖాస్తులు రావడంతో ప్రభుత్వానికి భారీగా ఆదాయం లభించింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం (Nda Government) అధికారంలోకి రావడంతో మద్యం కొత్త పాలసీ(New Policy)ని తీసుకొచ్చింది. గత ప్రభుత్వ విధానాన్ని రద్దు చేసింది. తక్కువ ధరకే మద్యం అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు లాటరీ విధానంలో షాపులు కేటాయించేందుకు దరఖాస్తులను స్వీకరించనుంది. 14న తీసే లాటరీలో షాపులు ఎవరికి దక్కుతాయో చూడాలి. 


Similar News