Tirumala: వైభవంగా బ్రహ్మోత్సవాలు... అశ్వ వాహ‌నంపై మలయప్పస్వామి దర్శనం

తిరుమల వేంకటేశ్వరస్వామి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాలు ఎనిమిదో రోజు వైభవంగా జరుగుతున్నాయి...

Update: 2024-10-11 15:34 GMT

దిశ, వెబ్ డెస్క్: తిరుమల వేంకటేశ్వరస్వామి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాలు ఎనిమిదో రోజు వైభవంగా జరుగుతున్నాయి. శుక్రవారం రాత్రి అశ్వ వాహ‌నంపై కల్కి అలంకారంలో మలయప్పస్వామి భ‌క్తుల‌కు దర్శనమిచ్చారు. రాత్రి 7 గంటలకు వాహ‌న‌సేవ జరిగింది. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, జీయ్యంగార్లు వేద‌మంత్రాల‌తో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామి వాహనసేవ కోలాహలంగా కొనసాగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు.

ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలుగా వర్ణిస్తున్నాయి. అందువల్ల అశ్వాన్ని అధిరోహించిన పరమాత్మ ఇంద్రియాలను నియమించే నియామకుడు. పరమాత్మను అశ్వ స్వరూపంగా కృష్ణయజుర్వేదం తెలియజేసింది. స్వామి అశ్వవాహనాదిరూఢుడై కల్కి స్వరూపాన్ని ప్రకటిస్తూ కలిదోషాలకు దూరంగా ఉండాలని, నామ సంకీర్తనాదులను ఆశ్రయించి తరించాలని ప్రబోధిస్తున్నారు. 

Full View


Similar News