తిరుమల శ్రీవారి సేవలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తి
రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి కృపా సాగర్ కుటుంబ సభ్యులతో కలిసి గురువారం ఉదయం నైవేద్య విరామ సమయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
దిశ, తిరుమల: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి కృపా సాగర్ కుటుంబ సభ్యులతో కలిసి గురువారం ఉదయం నైవేద్య విరామ సమయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ముందుగా శ్రీవారి ఆలయంలో హైకోర్టు న్యాయమూర్తి టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం ఆలయ రంగనాయక మండపంలో హైకోర్టు న్యాయమూర్తి కృప సాగర్ కు వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు.