RRR Case: సీఐడీ మాజీ ఏఎస్పీ విజయ్‌పాల్‌కు ప్రశ్నల వర్షం

మాజీ ఎంపీ, ప్రస్తుత ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజుపై వేధింపుల కేసులో సీఐడీ దూకుడు పెంచింది...

Update: 2024-10-11 15:58 GMT

దిశ, వెబ్ డెస్క్: నరసాపురం మాజీ ఎంపీ, ప్రస్తుత ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు(MLA Raghuramakrishnam Raju)పై వేధింపుల కేసులో సీఐడీ(CID) దూకుడు పెంచింది. నిందితుడు సీఐడీ మాజీ ఏఎస్పీ విజయ్ పాల్‌(Former Additional SP of CID Vijay Pal)ను అధికారులు విచారించారు. మూడు గంటల పాటు ప్రశ్నించారు. మరోసారి విచారణకు రావాలని ఆదేశించారు.

గత ప్రభుత్వ హయాంలో రఘురామకృష్ణంరాజును సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. అప్పటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడని రఘురామరాజు‌పై కేసు నమోదు చేసి విచారించారు.  విచారణాధికారిగా విజయ్ పాల్ పని చేశారు. అయితే విచారణ సమయంలో తనపై థర్డ్ డిగ్రీకి పాల్పడ్డారని రఘురామరాజు అప్పటి నుంచి ఆరోస్తూనే ఉన్నారు.  కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కానీ అప్పటి జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోంది. తనపై జరిగిన దాడికి సంబంధించి సీఐడీకి రఘురామరాజు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన సీఐడీ అధికారులు విచారణను వేగవంతం చేశారు. ఇందులో భాగంగా విజయ్ పాల్‌ను తాజాగా విచారించారు. 


Similar News