గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో సీఎం జగన్‌తో సహా కరతాళ ధ్వనులు

మేము ఆంధ్రప్రదేశ్ లో రూ. 5000 కోట్లు పెట్టుబడి పెట్టాలని చూస్తున్నాం అని విశాఖలోప్రారంభమైన గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ సమ్మిట్ లో ప్రకటించడంతో సీఎం జగన్‌తో పాటు కరతాళ ధ్వనులు మోగాయి.

Update: 2023-03-03 08:27 GMT

దిశ, ఉత్తరాంధ్ర : మేము ఆంధ్రప్రదేశ్ లో రూ. 5000 కోట్లు పెట్టుబడి పెట్టాలని చూస్తున్నాం అని విశాఖలోప్రారంభమైన గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ సమ్మిట్ లో ప్రకటించడంతో సీఎం జగన్‌తో పాటు కరతాళ ధ్వనులు మోగాయి. దీని ద్వారా 5000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుందని ఆ సంస్థ ప్రకటించింది. రాష్ట్ర ఖజానాకు ఏటా రూ.1000 కోట్ల విరాళం లభిస్తుందని శ్రీ సిమెంట్ లిమిటెడ్ ఛైర్మన్ హరి మోహన్ బంగూర్ అన్నారు. వెంటనే జెఎస్ డబ్ల్యు గ్రూప్ ఎండీ జిందాల్ కృష్ణపట్నం ఓడరేవులో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కోసం 10000 కోట్ల పెట్టుబడి పెడతామని ప్రకటన చేశారు. పెట్టుబడుల ప్రవాహం మొదలైంది.

Tags:    

Similar News