APCC: వాళ్లకు మీకు తేడా ఏంటి?.. ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ శర్మిల విమర్శలు
దీపం పెట్టామని గఫ్ఫాలు కొడుతూ విద్యుత్ చార్జీల(Power Charges)తో వాతలు పెడుతున్నారని, చార్జీల పెంపు(Charges Hike)కు నిరసనగా కాంగ్రెస్ పార్టీ(AP Congress) ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త ఆందోళనల(Protests)కు పిలుపునిస్తున్నామని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ శర్మిల(YS Sharmila) అన్నారు.
దిశ, డైనమిక్ బ్యూరో: దీపం పెట్టామని గఫ్ఫాలు కొడుతూ విద్యుత్ చార్జీల(Power Charges)తో వాతలు పెడుతున్నారని, చార్జీల పెంపు(Charges Hike)కు నిరసనగా కాంగ్రెస్ పార్టీ(AP Congress) ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త ఆందోళనల(Protests)కు పిలుపునిస్తున్నామని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ శర్మిల(YS Sharmila) అన్నారు. విద్యుత్ చార్జీల సర్దుబాటుపై ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆమె.. కూటమి ప్రభుత్వం(NDA Govt)పై హాట్ కామెంట్స్(Hot Comments) చేశారు. ఈ సందర్భంగా శర్మిల.. 3 సిలిండర్లు ఉచితం(Free Gas Cyllinders)గా ఇస్తూ పేద కుటుంబాల్లో దీపం పెట్టామని గఫ్ఫాలు కొట్టుకుంటున్న కూటమి సర్కార్... విద్యుత్ సర్దుబాటు చార్జీలతో మరోవైపు వాతలు పెడుతోందని ఆరోపణలు చేశారు. "ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో లాక్కోవడం అంటే” ఇదేనని ఎద్దేవా చేశారు. ఉచిత సిలిండర్ల పథకం కింద ఏడాదికి ఇచ్చేది రూ.2685 కోట్లు.. ప్రజల దగ్గర నుంచి కరెంటు బిల్లుల రూపంలో ముక్కుపిండి అదనంగా వసూలు చేసేది రూ.6వేల కోట్లు అని, ఇంకా రూ.3వేల కోట్లు ప్రజలపైనే అధనపు భారం పడుతుందని చెప్పారు. అంతేగాక దీపం-2(Deepam-2) కింద వెలుగులు పక్కన పెడితే.. కరెంటు బిల్లుల రూపంలో కుటుంబాల్లో కూటమి ప్రభుత్వం నింపేది కారు చీకట్లేనని విమర్శలు చేశారు.
అలాగే గత వైసీపీ చేసిన పాపమే ఇదని, ఈ ప్రభుత్వానికి సంబంధం లేదని, బిల్లుల వసూళ్లకు అనుమతి ఇచ్చింది ఏపీఈఆర్‌సీ(APERC) తప్ప.. మేము కాదని, చెప్తున్నవి కుంటి సాకులు తప్ప మరోటి కాదన్నారు. గత ప్రభుత్వం(YCP Govt) 9 సార్లు చార్జీలు పెంచిందని, తాము అధికారంలోకి వచ్చాక.. ఒక్క రూపాయి కూడా అదనపు భారం మోపమని, అవసరం అయితే 35 శాతం చార్జీలు తగ్గిస్తామని హామీలు ఇచ్చారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఇక వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో 9 సార్లు(9 Times In 5 Years) చార్జీలు పెంచితే, మీరూ మొదలుపెట్టారు కదా.. మీకు వాళ్లకు తేడా ఏంటని ప్రశ్నించారు. అలాగే ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం రూ.35 వేల కోట్లు ప్రజలపై భారం మోపితే, మీరు కూడా భారం మోపడం మొదలు పెట్టారు.. మీకు వాళ్లకు తేడా ఏంటని నిలదీశారు. ఆరు వేల కోట్లు ప్రజలపై మోపడం భావ్యం కాదని, బీజేపీ(BJP)కి మద్దతు ఇస్తున్నారు కదా.. సాయం తీసుకొచ్చి, ప్రభుత్వమే ఈ భారం మోయాలని చెప్పారు. ప్రజలపై సర్దుబాటు చార్జీల భారాన్ని మోపినందుకు నిరసనగా ఈ నెల 5 న ఏపీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు శర్మిల పిలుపునిచ్చారు.