AP: స్వార్థం కోసం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్: చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు
స్వార్థ ప్రయోజనాల కోసం జగన్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడని చంద్రబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
దిశ, వెబ్‌డెస్క్: స్వార్థ ప్రయోజనాల కోసం జగన్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడని చంద్రబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇవాళ విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో ప్రచారంలో ఆయన మాట్లాడుతూ.. శృంగవరపుకోట ప్రజలకు చైతన్యవంతులని అన్నారు. ప్రజలంతా వైసీపీని ఓడించాలని సంకల్పంతో ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రజలకు సైకో పాలనలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. తాను తన జీవితంలో ఎన్నో తుఫానులను చూశానని.. మే 13న కనీవినీ ఎరుగని రీతిలో తుఫాను రాబోతోందని అన్నారు.
ఆ తుఫానులో వైసీపీ బంగాళాఖాతంలో కలిసిపోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వంలో ఎవరికీ రక్షణ లేదని ఆరోపించారు. తాజాగా గుంటూరుకు చెందిన మహిళ వైసీపీ ప్రభుత్వానికి ఎదురు తిరిగిందని పేర్కొన్నారు. వారి అక్రమాలను వివరించేందుక ఏకంగా ఢిల్లీకి వెళ్లి ఎంతో మంది ప్రముఖులను కలవడానికి ప్రయత్నం చేసిందని తెలిపారు. కానీ, అనుమతి లేకపోవడంతో ఆమె బొటన వేలు కట్ చేసుకుని నిరసన తెలిపిందని అన్నారు. జగన్ రాష్ట్రాన్ని తన స్వార్థం కోసం సర్వనాశనం చేశాడని ఫైర్ అయ్యారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఓటు ద్వారా సైకో ప్రభుత్వానికి సరైన బుద్ధి చెప్పాలని అన్నారు.