AP News : కరువు మండలాలకు నిధులు విడుదల చేసిన ఏపీ సర్కార్

ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ లో పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందజేతపై ఏపీ వ్యవసాయశాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు ప్రకటన విడుదల చేశారు.

Update: 2024-11-15 11:23 GMT

దిశ, వెబ్ డెస్క్ : ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ లో పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందజేతపై ఏపీ వ్యవసాయశాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు ప్రకటన విడుదల చేశారు. వర్షాలు లేక ఖరీఫ్ సీజన్లో ఏపీలోని 5 జిల్లాలోని 54 మండలాలను గత అక్టోబర్లో కరువు ప్రాంతాలుగా ప్రభుత్వం గుర్తించింది. 1.06 లక్షల హెక్టార్లలో 1.44 లక్షల మంది రైతులు పంటలను నష్టపోగా.. అందుకు నష్టపరిహారంగా రూ.159.20 కోట్లు విడుదల చేసినట్టు మంత్రి నేడు అసెంబ్లీ సమావేశాల్లో పేర్కొన్నారు. అలాగే ఈనెల 28 వరకు మరోసారి అంచనాలు వేసి నష్టపోయిన రైతులందరికీ పరిహారం అందిస్తామని తెలియ జేశారు.

Tags:    

Similar News