Amaravati: ఏపీ రాజధాని పరిధి పెంపు.. ఆ ప్రాంతాల ప్రజలకు గుడ్ న్యూస్

ఏపీ రాజధాని పరిధిని పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది....

Update: 2024-11-06 17:23 GMT

దిశ, వెబ్ డెస్క్: సత్తెనపల్లి, పల్నాడు, బాపట్ల ప్రాంత ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. సీఆర్డీఏ(CRDA)లో 154 గ్రామాలను విలీనం చేసింది. ఈ మేరకు అమరావతి రాజధాని(Amaravati Capital) ప్రాంత పరిధి పెరగనుంది. మరోవైపు అమరావతి చుట్టూ ఔటర్ రింగు రోడ్డు నిర్మాణం కోసం సీఆర్డీఏ పరిధిని పెంచింది. అలాగే 311 మంది పారిశ్రామిక వేత్తలకు రాజధాని అమరావతిలో భూమిని కేటాయించింది. ఈ మేరకు అమరావతి పరిధిని పెంచుతూ ఏపీ కేబినెట్(AP Cabinet) నిర్ణయించింది. గతంలో మాదిరిగా 8 వేల 352 చదరపు కిలో మీటర్లకు పెంచుతూ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం రాజధానిని కుదించింది. అందులో భాగంగా పలు గ్రామాలను వేరు చేసింది. అయితే కూటమి ప్రభుత్వం రాజధాని అమరావతి పరిధిని గతం మాదిరిగా పెంచాలని నిర్ణయించింది. ఈ మేరకు కేబినెట్ భేటీలో చర్చించారు. ఇందుకు మంత్రులు సైతం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రాజధాని పరిధిని పెంచుతూ కేబినెట్ ప్రకటన చేసింది.

Tags:    

Similar News