Andhra Pradesh Weather Update : ఏపీలో భారీ వర్షాలు.. కీలక నిర్ణయం తీసుకున్న విద్యాశాఖ

గత వారం రోజుల నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి.

Update: 2023-07-27 06:19 GMT

దిశ, వెబ్‌డెస్క్: గత వారం రోజుల నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. కొన్ని కొన్ని చోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. దీంతో ప్రజలు బయటకు రావాలంటేనే భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించి.. ఉత్తర్వులు జారీ చేసింది. బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడటంతో ఏపీ మొత్తం వానలతో తడిసి ముద్దవుతుంది. ఈ నేపథ్యంలో 10 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇందులో పశ్చిమగోదావరి, ఏలూరు, అల్లూరి సీతారామరాజు, ఎన్టీఆర్, పల్నాడు, కాకినాడ, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలు ఉన్నాయి. అంతే కాకుండా పలు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు.

Tags:    

Similar News