ఏపీలో నాసిరకం మద్యం.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

ఏపీలో మొత్తం జగన్ బ్రాండ్‌లేనని, నాసిరకం మద్యంతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని మాజీ సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు....

Update: 2024-05-02 12:39 GMT

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో మొత్తం జగన్ బ్రాండ్‌లేనని, నాసిరకం మద్యంతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని మాజీ సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యపాన నిషేధం చేశాకే ఓట్లు అడుగుతామన్న హామీ ఏమైందని ఆయన ప్రశ్నించారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో ప్రజాగళం సభ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన 99 శాతం అమలు కాలేదని విమర్శించారు. హామీలు అమలు చేయలేని జగన్‌కు ఓటు అడిగే హక్కు లేదన్నారు. ఉద్యోగం రావాలంటే చంద్రబాబు రావాలని.. గంజాయి కావాలంటే జగన్ ఉండాలని చంద్రబాబు ఎద్దేవా చేశారు. రైతుల పాస్ పుస్తకాలపై జగన్ బొమ్మ వేసుకోవడం ఏంటని ప్రశ్నించారు. ప్రజలకు జగన్ తాత, నాన్న భూములు ఇచ్చారా అని నిలదీశారు. రాయచోటికి సీఎం జగన్ ఏమైనా పనులు చేశారా అని వ్యాఖ్యానించారు. కడపకు స్టీల్ ప్లాంట్ ఎందుకు తీసుకురాలేకపోయారని ప్రశ్నించారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రన్న బీమా మళ్లీ తీసుకొస్తామని చెప్పారు. గెలుపు తమదేనని, అభివృద్ధికి పునాది వేసుకోవాలని చంద్రబాబు తెలిపారు.

Read More..

అసలు ఏం చేశారు.. ఎందుకు సిద్ధం: సీఎం జగన్‌పై పవన్ ఫైర్ 

Tags:    

Similar News