Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు
అటవీశాఖ అధికారుల(Forest officials)కు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(AP Deputy CM Pawan Kalyan) కీలక ఆదేశాలు జారీ చేశారు.
దిశ, వెబ్‌డెస్క్: అటవీశాఖ అధికారుల(Forest officials)కు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(AP Deputy CM Pawan Kalyan) కీలక ఆదేశాలు జారీ చేశారు. సోమవారం ఏపీలో వన్యప్రాణుల సంరక్షణకు టోల్‌ఫ్రీ నెంబర్. 18004255909 ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్(Pawan Kalyan) మాట్లాడారు. వన్యప్రాణులకు వేటాడటం, చంపడం, అక్రమ రవాణా చేయడం నేరం అని అన్నారు. అలా ఎవరైనా నిబంధనలు అతిక్రమించి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అడవులను సంరక్షించడం, వన్యప్రాణులను కాపాడటం మన అందరి బాధ్యత అని గుర్తుచేశారు. ప్రకృతికి, అటవీ సంపదకు ఎవరైనా హానీ తలపెడితే వెంటనే ఫారెస్ట్ అధికారుల దృష్టికి తీసుకురావాలని ప్రజలను పవన్ కల్యాణ్(Pawan Kalyan) కోరారు.