భద్రతా చర్యల్లో నిర్లక్ష్యం.. ఎసెన్షియా ఫార్మా ప్రమాదంపై పవన్ తీవ్ర ఆగ్రహం

భద్రతా చర్యల్లో నిర్లక్ష్యం వల్లే ఎసెన్సియా ఫార్మాలో ప్రమాదం జరిగిందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ..

Update: 2024-08-22 06:03 GMT

దిశ, వెబ్ డెస్క్: భద్రతా చర్యల్లో నిర్లక్ష్యం వల్లే ఎసెన్సియా ఫార్మాలో ప్రమాదం జరిగిందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. అచ్యుతాపురం సెజ్‌లో జరిగిన దుర్ఘటనపై ఆయన స్పందించారు. ఫార్మా కంపెనీ యాజమాన్యంలో బాధ్యతారాహిత్యం కనిపిస్తోందన్నారు. ‘‘యాజమాన్యంలో విభేదాలున్నాయనే సమచారం ఉంది. కాలుష్య నివారణకు కంపెనీలు ముందుకు వచ్చి తనిఖీలు చేయించుకోవాలి. కంపెనీలకు, కార్మికులకు భద్రత ఇవ్వాల్సిన బాధ్యత మాపై ఉంది. నెలాఖరులోపు విశాఖ వెళ్తా. కాలుష్యం, పరిశ్రమల సేఫ్టీ ఆడిట్‌పై ఫోకస్ పెడతా. విశాఖలో కాలుష్యం, ప్రమాదాలపై కార్యచరణ ప్రకటిస్తాం.. మూడు నెలల్లో అమలు చేస్తాం.’’ అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. కెమికల్ కంపెనీల్లో భద్రతకు సంబంధించి త్వరలోనే పూర్తి స్థాయి సమీక్ష నిర్వహిస్తామని చెప్పారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. కంపెనీల్లో ప్రమాదాలు సాధారణమైపోయాయని, ప్రాణాలకు విలువ లేని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదాలకు త్వరలోనే అడ్డుకట్ట వేస్తామని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.

Tags:    

Similar News