ఆడవాళ్లను మీరు తిట్టలేదా?: పవన్ కల్యాణ్
మాజీ మంత్రి పేర్ని నాని తప్పు చేయడం వల్లే వాళ్ల ఇంట్లో వాళ్లు కూడా రోడ్డు మీదకు వచ్చారని పవన్ కల్యాణ్ అన్నారు...
దిశ, వెబ్ డెస్క్: మాజీ మంత్రి పేర్ని నాని(Former Minister Perni Nani) తప్పు చేయడం వల్లే వాళ్ల ఇంట్లో వాళ్లు కూడా రోడ్డు మీదకు వచ్చారని పవన్ కల్యాణ్(Pawan Kalyan) అన్నారు. తన ఇంట్లో వాళ్లను కూటమి ప్రభుత్వం టార్గెట్ చేసిందని పేర్ని నాని చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి(Nara Bhuvaneswari)ని అసెంబ్లీ వేదికగా అవమానించిన విషయం మర్చిపోయారా అని ప్రశ్నించారు. అప్పుడు తిట్టి ఇప్పుడు నీతులు చెబితే ఎలా అని నిలదీశారు. ఆడవాళ్లపై తాము కేసులు పెట్టలేదన్నారు. ఇంట్లో వారి పేరుతో గోడౌన్‌లు నిర్మించిందెవరో చెప్పాలన్నారు. రేషన్ బియ్యం(Ration Rice) మాయం అయింది నిజమని, పేర్ని నాని డబ్బులు కట్టింది కూడా వాస్తవమేనన్నారు. గత ప్రభుత్వం కన్నా తమ సర్కార్ మంచిగా పని చేస్తుందని పవన్ తెలిపారు. గతంలో తీసుకున్న అడ్డగోలు నిర్ణయాలను అధికారులు కూడా చెప్పలేకపోతున్నారన్నారు. అన్ని వ్యవస్థలను నాశనం చేశారని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.