త్వరలో సీఎం చంద్రబాబును కలుస్తా.. వైఎస్ షర్మిల కీలక ప్రకటన

విశాఖ స్టీ్ల్ ప్లాంట్(Visakha Steel Plant) విషయంలో బీజేపీ(BJP) చిల్లర రాజకీయాలు చేస్తోందని ఏపీ కాంగ్రెస్

Update: 2024-10-04 11:55 GMT

దిశ, వెబ్‌డెస్క్: విశాఖ స్టీ్ల్ ప్లాంట్(Visakha Steel Plant) విషయంలో బీజేపీ(BJP) చిల్లర రాజకీయాలు చేస్తోందని ఏపీ కాంగ్రెస్(AP Congress) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడారు. స్టీల్ ప్లాంట్ అంశంపై త్వరలోనే అఖిలపక్షంతో వెళ్లి సీఎం చంద్రబాబును కలుస్తామని కీలక ప్రకటన చేశారు. రాహుల్ గాంధీని విమర్శించే నైతిక హక్కు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌(Pawan Kalyan)కు లేదని షర్మిల సీరియస్ అయ్యారు. ప్రధాని మోడీ డైరెక్షన్‌లో పవన్ కల్యాణ్ నటిస్తున్నారని విమర్శించారు. తిరుమల లడ్డూ వివాదంపై స్పెషల్ సిట్‌ను స్వాగతిస్తున్నట్లు తెలిపారు. సెక్యూలర్ పార్టీగా ప్రారంభమైన జనసేన.. ఇప్పుడు పూర్తిగా రైటిస్ట్‌గా మారిందని సెటర్లు వేశారు. అంతకుముందు సోషల్ మీడియా వేదికగా షర్మిల కీలక ట్వీట్ పెట్టారు.

‘అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి వేషం, భాషా రెండు మారాయి. సెక్యూలర్ పార్టీగా ఉన్న జనసేన కాస్త రైటిస్ట్ పార్టీగా మారిందా..?. బాధ్యత కలిగిన పదవిలో ఉండి, ఒక మతానికి చెందిన వేషాన్ని వేసుకుని, ఆ మతమే ముఖ్యమని మాట్లాడుతుంటే... ఇతర మతాలకు అభద్రతాభావం ఉండదా..? ఎన్నికల్లో వారి ఓట్లు మీకు పడలేదా..? ఇతర మతాల వాళ్ళకు మనోభావాలు ఉండవా..? మతం అడ్డుపెట్టుకుని రాజకీయం చేయడం RSS సిద్ధాంతమైతే.. అదే సిద్ధాంతానికి పవన్ కళ్యాణ్ డబుల్ ఏజెంట్ అయ్యాడు. ప్రధాని మోడీ దర్శకత్వంలో యాక్టింగ్ చేసే మీకు రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడే నైతికత లేదు. మణిపూర్, గోద్రాలలో ఊచకోత కోసింది బీజేపీ పార్టీ కాదా..? అటువంటి పార్టీకి మద్దతు ఇచ్చిన మీరు లౌకికవాదం పాటించాలని చెప్తే నమ్మమంటారా..? ఈ దేశంలో ప్రేమ, సమానత్వం, సోదరభావం పెంపొందించేందుకు రాహుల్ గాంధీ గారు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. అటువంటి వ్యక్తి గురించి మాట్లాడి మీ స్థాయిని దిగజార్చుకోవద్దు పవన్ కళ్యాణ్ గారు’ అని షర్మిల ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

Tags:    

Similar News