ఏపీ కేబినెట్ సమావేశం.. కొత్త లిక్కర్ పాలసీతో పాటు ఆ విషయాలపై ఫోకస్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మంత్రివర్గ సమావేశం ఈ రోజు (బుధవారం) ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబునాయుడు అధ్యక్షతన జరగనుంది.

Update: 2024-09-18 04:12 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మంత్రివర్గ సమావేశం (AP Cabinet Meeting) నేడు (బుధవారం) ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబునాయుడు (CM Chandrababu Naidu) అధ్యక్షతన ప్రారంభమైంది. ఈ సమావేశంలో కొత్త లిక్కర్ పాలసీ (New Liquor Policy)కి కేబినెట్ ఆమోదం తెలపనున్నట్లు తెలుస్తోంది. అలాగే పూర్తి స్థాయి బడ్జెట్ (Complete Budget), అసెంబ్లీ నిర్వహణపై చర్చ జరిగే అవకాశం కూడా ఉంది. ఇక ఆపరేషన్ బుడమేరు (Operation Budameru)పై కూడా కేబినెట్ ఓ నిర్ణయం తీసుకోనుందని, భవిష్యత్‌లో వరదల వల్ల తీవ్ర నష్టం జరగకుండా శరవేగంగా బుడమేరు పనులు పూర్తి చేయడంపై ప్రభుత్వం ఫోకస్ పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు బీసీ కార్పొరేషన్ (BC Corporation) పునర్వవస్థీకరణకు ఆమోదం తెలపడమే కాకుండా, బీసీ సంక్షేమం కోసం నిధుల మంజూరుపై కూడా కీలక నిర్ణయం తీసుకునే చాన్స్ ఉందని తెలుస్తోంది. అలాగే సీఎం ప్రకటించిన వరద సాయానికి కూడా ఈ కేబినెట్ మీటింగ్‌లో ఆమోదం తెలుపనున్నట్లు సమాచారం.


Similar News