AP cabinet meeting:ఈ నెల 18న కేబినెట్ సమావేశం..కీలక అంశాలపై చర్చలు

ఆంధ్రప్రదేశ్‌లో ఈ నెల 18న సీఎం చంద్రబాబు(CM Chandrababu) అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో కేబినెట్ సమావేశం(cabinet meeting) జరగనుంది.

Update: 2024-09-13 09:27 GMT

దిశ,వెబ్‌డెస్క్:ఆంధ్రప్రదేశ్‌లో ఈ నెల 18న సీఎం చంద్రబాబు(CM Chandrababu) అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో కేబినెట్ సమావేశం(cabinet meeting) జరగనుంది. ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో వరద నష్టం(Flood Loss), ఆపరేషన్ బుడమేరు, కొత్తవారికి పెన్షన్ల మంజూరు, ఇతర పథకాల అమలు, సీఆర్డీఏ పరిధిలో నిర్మాణాలు, కొత్త మద్యం పాలసీ(New Liquor Policy), ప్రభుత్వ పరంగా చేపట్టాల్సిన అంశాలపై చర్చించాల్సిన అంశాలను ఈ నెల 15 వ తేదీలోగా పంపాలని సీఎస్ నీరభ్ కుమార్(Nirabh Kumar) ఆదేశించారు. అయితే ఈ సమావేశంలో కొత్త మద్యం పాలసీ(New Liquor Policy) ఈ గురించి నిర్ణయం తీసుకుంటే రాష్ట్రంలో మద్యం ధరలు చాలా వరకు తగ్గుతాయని అంటున్నారు. నాణ్యమైన మద్యం(Quality liquor) కూడా వస్తుందని చెబుతున్నారు.


Similar News