జమిలి ఎన్నికలపై మరోసారి క్లారిటీ ఇచ్చిన ఏపీ బీజేపీ చీఫ్

దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు(జమిలి) జరపాలని కేంద్రంలోని బీజేపీ(BJP) ఎప్పటినుంచో ప్రయత్నిస్తుంది.

Update: 2024-10-18 10:28 GMT

దిశ, వెబ్ డెస్క్: దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు(జమిలి) జరపాలని కేంద్రంలోని బీజేపీ(BJP) ఎప్పటినుంచో ప్రయత్నిస్తుంది. కాగా దీనిపై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సమక్షంలో ఓ కమిటిని వేయగా.. పూర్తిస్థాయి సమీక్ష అనంతరం జమిలి ఎన్నికలు నిర్వహించడానికి అనూకూల పరిస్థితులపై నివేధికను అందించింది. దీంతో త్వరలోనే కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికలు నిర్వహిస్తుందని.. ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదంటూ మీడియా వేదికగా ప్రచారం చేస్తున్నారు. కాగా ఈ వ్యాఖ్యలపై ఏపీ బీజేపీ చీఫ్, రాజమండ్రి ఎంపీ పురందేశ్వరి స్పందించారు. దేశంలో జమిలి ఎన్నికల నిర్వాహణ ఇంకా చర్చల దశలోనే ఉన్నాయని, జమిలి ఎన్నికలపై వైసీపీ పార్టీ అసత్య ప్రచారం చేస్తుందని, ఆ పార్టీకి ఉన్న సమాచారమేంటో మాకు తెలియదంటూ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చారు.


Similar News