మరో ముందడుగు.... సరికొత్త లక్ష్యానికి కాసేపట్లో శ్రీకారం

ఏపీ సీఎం చంద్రబాబు పాలనలో మరో అడుగు ముందుకు వేశారు....

Update: 2024-12-13 03:37 GMT

దిశ,వెబ్ డెస్క్: ఏపీ సీఎం చంద్రబాబు(Ap Cm Chandrababu) పాలనలో మరో అడుగు ముందుకు వేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఆయన మరో సరికొత్త విజన్‌కు శ్రీకారం చుట్టారు. విభజనతో నష్టపోయిన ఏపీ(Ap)ని మిగిలిన రాష్ట్రాలకంటే దీటుగా తీర్చిదిద్దేందుకు నిర్దిష్టమైన లక్ష్యంతో ముందుకు వెళ్లేందుకు రెడీ అయ్యారు. ఈ మేరకు స్వర్ణాంధ్ర-2047 విజన్ డాక్యుమెంట్‌(Swarnandhra-2047 Vision Document)ను సీఎం చంద్రబాబు విడుదల చేయనున్నారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియం(Vijayawada Indira Gandhi Municipal Stadium)లో ఈ కార్యక్రమం జరగనుంది. ఈ సందర్భంగా ఏపీ లక్ష్యాన్ని ప్రజలకు వివరించనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు సహా పార్టీ నేతలు పాల్గొన్నారు. ఏపీతో పాటు తెలంగాణ నుంచి పార్టీ కార్యకర్తలు భారీగా తరలివస్తుండటంతో విజయవాడ పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. ట్రాఫిక్ పోలీసులు పలు వాహనాలను దారి మళ్లిస్తున్నారు.

Tags:    

Similar News