చంద్రబాబుకు మరో షాకిచ్చిన కేశినేని నాని.. రంగంలోకి దిగిన కూతురు

రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో విజయవాడ నుంచి తనకు టికెట్ లేదని, అతడి తమ్ముడు చిన్నీ (శివనాథ్)కి అదే స్థానంలో ఎంపీ టికెట్ ఇచ్చేందుకు టీడీపీ అధిష్టానం ఓకే చెప్పిందని తెలియడంతో ఎంపీ కేశినేని నాని నిన్న ట్విట్టర్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-01-08 05:52 GMT

దిశ, వెబ్‌డెస్క్ : రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో విజయవాడ నుంచి తనకు టికెట్ లేదని, అతడి తమ్ముడు చిన్నీ (శివనాథ్)కి అదే స్థానంలో ఎంపీ టికెట్ ఇచ్చేందుకు టీడీపీ అధిష్టానం ఓకే చెప్పిందని తెలియడంతో ఎంపీ కేశినేని నాని నిన్న ట్విట్టర్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు.పార్టీలో తనను వద్దనుకున్నప్పుడు.. నేనుందుకు అందులో ఉండటం అంటూనే త్వరలో ఎంపీ పదవికి, టీడీపీకి రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఈ పరిణామంతో నిన్న తిరువూరు సభ సక్సెస్ అయిన సంతోషం కూడా టీడీపీకి లేకుండా పోయింది. ఈ క్రమంలోనే కేశినేని నాని ఇవాళ ట్విట్టర్ వేదికగా ప్రకటన చేశారు. ఇవాళ నా కూతురు శ్వేత ప్రస్తుతం విజయవాడ నగర కార్పొరేటర్‌గా ఉన్నారు. ఇవాళ ఆమె ఉదయం 10.30 గంటలకు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి వెళ్లి తన పదవికి రాజీనామా చేసి ఆమోదింపజేసుకుని, ఆ మరుక్షణమే టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తారు’ అని ట్వీట్‌ చేశారు. ఈ క్రమంలో నానీ పార్టీ నుంచి వెళ్లిపోతూ.. రాజకీయంగా పెద్ద డ్యామేజ్ చేస్తూ వెళ్తున్నారని పలువురు చర్చించుకుంటున్నారు.

Tags:    

Similar News