అమరావతి నిర్మాణంలో మరో కీలక ముందడుగు
అమరావతి (Amaravati) నిర్మాణంలో మరో కీలకమైన ముందడుగు పడింది. నిధుల మంజురు కోసం మరో కీలక బ్యాంక్ ఆమోదం తెలిపింది.
దిశ, వెబ్‌డెస్క్: అమరావతి (Amaravati) నిర్మాణంలో మరో కీలకమైన ముందడుగు పడింది. నిధుల మంజురు కోసం మరో కీలక బ్యాంక్ ఆమోదం తెలిపింది. దీంతో రాజధాని నిర్మాణ పనులను ఏపీ సర్కార్ వేగవంతం చేస్తోంది. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు అందించే గ్రీన్ స్మార్ట్ కాపిటల్ సిటీగా అమరావతిని అభివృద్ధి చేయడం కోసం ఆసియా డెవలప్ బ్యాంక్ (Asian Development Bank) అప్పు ఇచ్చిందుకు నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ.15 వేల కోట్ల రుణాలు ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. మరోవైపు ప్రపంచ బ్యాంక్ కూడా ఏపీకి రుణాలు మంజూరు చేయడంపై ఈ నెల 19వ తేదిన నిర్ణయం తీసుకోనుంది.
ఇదిలా ఉండగా అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దడానికి ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇంక్లూసివ్ సస్టేనబుల్ కాపిటల్ సిటీ డెవలప్ మెంట్ ప్రొగ్రామ్‌తో అమరావతిని గ్రోత్ హబ్‌గా (Growth hub) మర్చాడానికి ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఆర్థిక, అవకాశాలు మెరుగుపరచడానికి, ఉద్యోగ అవకాశాలు అందించడానికి ప్రయత్నిస్తోంది. లాండ్ పులింగ్ (Land Pulling) పథకాల కింద వాటనార్‌లో ఉన్న రైతులకు ప్రయోజనం చేకూరే విధంగా ట్రక్ ఇన్ ఫ్రాస్ర్టాక్చర్, ప్రభుత్వ కాంప్లెక్స్ నిర్మాణంతో పాటు అమరావతిలో మౌలిక సదుపాయల అభివృద్ధిపై ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఆసియా డెవలప్ బ్యాంక్‌తో పాటు మల్టీ లెటరల్ డెవలప్ బ్యాంక్ సాకారంతో అమరావతిలో మౌలిక వసతులను డెవలప్ చేస్తుంది. ఏడీబీ ఇతర మండీబీల ఆర్థిక సహకారంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రపంచ నైపుణ్యం సాంకేతిక మద్ధతు కూడా లభించనుంది.