AP Politics:వైసీపీకి మరో బిగ్ షాక్.. టీడీపీలో చేరిన కీలక నేత
రాష్ట్రంలో వైసీపీ(YCP)కి మరో షాక్ తగిలింది.
దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో వైసీపీ(YCP)కి మరో షాక్ తగిలింది. ఏపీలో ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం చెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వైసీపీ కేవలం 11 స్థానాలకే పరిమితం కావడంతో పార్టీ నేతల్లో అసహనం నెలకొంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలువురు పార్టీ నేతలు వైసీపీని వీడి అధికార పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నేడు(మంగళవారం) చిత్తూరు జిల్లా కుప్పంలో వైసీపీకి షాక్ తగిలింది. ఆ పార్టీకి కుప్పం మున్సిపల్ ఛైర్మన్ డాక్టర్ సుధీర్ రాజీనామా చేశారు. వైసీపీతో పాటు మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్ పదవులకు రాజీనామా చేసినట్లు ఆయన తెలిపారు. ఛైర్మన్ పదవికి సంబంధించిన రాజీనామా లేఖను మున్సిపల్ కమిషనర్‌కు పంపారు. అనంతరం అమరావతిలో సీఎం చంద్రబాబు(CM Chandrababu) సమక్షంలో డాక్టర్ సుధీర్ టీడీపీలో చేరారు. ఆయనకు సీఎం పసుపు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. చిత్తూరు జిల్లాలోని రామకుప్పం మండలం వైసీపీ నుంచి ఏడుగురు ఎంపీటీసీలు కూడా చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు.