Ap: మత్స్యకారులకు బ్యాడ్ న్యూస్.. అప్పటివరకు చేపల వేట నిషేధం
ఏప్రిల్ 15 నుంచి జూన్14 వరకు సముద్రంలో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని ప్రభుత్వం సూచించింది. ..
దిశ, నెల్లూరు: ఏప్రిల్ 15 నుంచి జూన్14 వరకు సముద్రంలో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని ప్రభుత్వం సూచించింది. మొత్తొ 61 రోజులు సముద్రంలో చేపల వేటపై నిషేధం విధిస్తున్నట్లు మత్స్యశాఖ తెలిపింది. ఈ నిషేధిత 61 రోజుల సమయంలో సముద్రంలో ఉండే రొయ్యలు, చేపలు గుడ్లు పెట్టే సమయంలో మత్స్య సంపద అభివృద్ధి కొరకు ఈ నిషేధం విధించబడిందని పేర్కొంది. ఈ సమయంలో మరబోట్లు మేకనైజ్డ్ బోట్స్, మోటారు బోట్లతో సముద్రంలోకి వెళ్లడం నిషేధమని, ఎవరైనా ప్రభుత్వ ఉత్తర్వులు దిక్కరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మత్స్యకారులకు కల్పించే డీజిల్‌పై రాయితీలు, ఇతర పథకాలు రద్దు చేయబడతాయని తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వం జీవో విడుదల చేసింది.