weather Report: తెలుగురాష్ట్రాల్లో భగ్గుమంటున్న భానుడు.. 115 మండలాల్లో తీవ్ర వడగాల్పులు
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 9 గంటలు దాటిందంటే చాలు ప్రజలు బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు.
దిశ వెబ్ డెస్క్: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 9 గంటలు దాటిందంటే చాలు ప్రజలు బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో రోజురోజుకి ఉష్ణోగ్రతలు తార స్థాయికి చేరుకుంటున్నాయి. ఓవైపు ఎండలు మరో వైపు వడగాల్పులతో ఆంధ్ర ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఆంధ్రప్రదేశ్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఐఎండీ సూచిస్తోంది. దీనితో ఈ ఏడాది ఎక్కువ రోజులపాటు వడగాల్పులు వీయవచ్చని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ హెచ్చరికలు జారీ చేశారు.
ఇక ఈ రోజు 109 మండలాల్లో తీవ్రవడగాల్పులు, అలానే రేపు 206 మండలాల్లో సాధారణ వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. అలానే రేపు 115 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉండగా.. 245 మండలాల్లో సాధారణ వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లాలో 24 మండలాల్లో, విజయనగరం జిల్లాలో 25 మండలాల్లో, అల్లూరిసీతారామరాజు6, పార్వతీపురంమన్యం14, , అనకాపల్లి16,విశాఖపట్నం 3, కాకినాడ11, కోనసీమ1, తూర్పుగోదావరి 9 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.