హిందూపురంలో బాలయ్యను ఓడించేందుకు బిగ్ స్కెచ్.. !

వచ్చే ఎన్నికల్లో హిందూపురంలో బాలకృష్ణను ఓడిస్తామని బస్సు యాత్రలో వైసీపీ నేతలు అన్నారు. ...

Update: 2023-11-15 12:51 GMT

దిశ, వెబ్ డెస్క్:  గత ఎన్నికల్లో టీడీపీకి చెందిన హేమాహేమీలను వైసీపీ ఓడించగలిగింది. కానీ తెలుగు దేశం పార్టీకి కంచుకోట అయిన హిందూపురంలో మాత్రం బాలయ్యను ఓడించకలేకపోయింది. అంతేకాదు భారీ ఓట్ల తేడాతో అక్కడ వైసీపీ ఓటమి పాలైంది. అయితే ఈ సారి మాత్రం హిందూపురంలో ఎలాగైనా సరే గెలవాలనే పట్టుదలతో ఉంది వైసీపీ. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ తర్వాత రెండు సార్లు కూడా టీడీపీనే హిందూపురంలో గెలిచింది. ఎమ్మెల్యేగా బాలయ్యనే గెలిచారు. మరి కొన్ని నెలల్లో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో టీడీపీ కంచుకోటను బద్దలు కొట్టాలనే ధృడ నిశ్చయంతో ఉంది. ఇందుకు ఇప్పటి నుంచే ఆ నియోజకవర్గంపై వైసీపీ అధిష్టానం ఫోకస్ పెంచింది. పార్టీలకతీతంగా అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తోంది. ఎప్పటికప్పుడు పార్టీ నాయకులు నియోజకవర్గం ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. మరోవైపు బాలయ్య కూడా నియోజకవర్గం ప్రజలకు ఎప్పుడూ అందుబాటులోనే ఉంటున్నారు. ఈసారి కూడా గెలిచి హ్యాట్రిక్ విజయం సాధించాలనే ఆతృతతో ఉన్నారు.

అయితే వైసీపీ నాయకులు మాత్రం ఈ సారి హిందూపురంలో గెలుపు తమదేనంటూ ధీమాగా చెప్పుకుంటున్నారు. తాజాగా హిందూపురం నియోజకర్గంలో జరిగిన బస్సు యాత్రలో కూడా వైసీపీ నాయకులు ఇదే విషయాన్ని తేల్చి చెప్పారు. వచ్చే ఎన్నికల్లో హిందూపురంలో బాలయ్యను గ్యారంటీగా ఓడిస్తామని యాత్ర పొడువునా చెప్పుకొచ్చారు. జగన్ పాలనతో ఈ టీడీపీ కంచుకోటను బద్ధలుకొడతామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సీఎం జగన్ న్యాయం చేస్తున్నారని చెబుతున్నారు. ఇదే విషయాన్ని డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, మంత్రి జయరాం పదే పదే ప్రచారం చేస్తున్నారు.  అంటే వైసీపీ నాయకులు అంత ధీమాగా చెబుతున్నారంటే బాలయ్యను ఓడించేందుకు హిందూపురంలో ఏదో పెద్ద స్కేచ్చే వేస్తున్నారని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. బాలయ్య అప్రమత్తంగా లేకపోతే ఈ సారి ఎన్నికల్లో హిందూపురంలో నందమూరి సెంటిమెంట్‌కు షాక్ తగిలే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

అయితే చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో బాలయ్య హిందూపురంలో పెద్దగా ఉండటం లేదనే టాక్ నడుస్తుండటంతో రాజకీయ విశ్లేషకులు ముందుగానే హెచ్చరిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వైసీపీ స్కెచ్‌ను బాలయ్య పసిగట్టి మళ్లీ హిందూపురంలో గెలుస్తారేమో చూడాలి.

Tags:    

Similar News