కేంద్రమంత్రితో అనకాపల్లి ఎంపీ సత్యవతి భేటీ

అనకాపల్లి ఎంపీ డా.బి.సత్యవతి కేంద్రమంత్రి ఇంద్రజీత్ సింగ్‌తో భేటీ అయ్యారు.

Update: 2023-08-08 12:40 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : అనకాపల్లి ఎంపీ డా.బి.సత్యవతి కేంద్రమంత్రి ఇంద్రజీత్ సింగ్‌తో భేటీ అయ్యారు. కశింకోట గ్రామంలో పెదగుమ్మం వంతెన బాట నిర్మాణం పూర్తికి ఎంపీ నిధులు వినియోగానికి అనుమతులు మంజూరు చేయాలని చేయాలని కోరారు. ఈమేరకు కేంద్ర స్టాటిస్టిక్స్‌ అండ్‌ కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రి ఇంద్ర‌జీత్‌ సింగ్‌కి ఎంపీ సత్యవతి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఎంపీ సత్యవతి మాట్లాడారు. అనకాపల్లి జిల్లా కశింకోట గ్రామంలో వంతెన బాట నిర్మాణానికి సుమారు 2.85 లక్షలుఅవసరం అవుతాయని.. ఎంపీ నిధులు నుండి వినియోగానికి అనుమతులు మంజూరు చేయాలని కోరినట్లు వెల్లడించారు. కసింకోట గ్రామస్థులు నిత్యం తన అవసరాల నిమిత్తం వ్యవసాయ కార్యకలాపాలు, పశువుల పెంపకం, సాగు కోసం శారదా నదిని దాటడంపై ఎక్కువగా ఆధారపడతారని స్పష్టం చేశారు. వర్షాకాలంలో ఈ నది దాటడం చాలా ప్రమాదకరమని స్పష్టం చేశారు. అందువల్ల నిధులు మంజూరు చేసి సమస్యను పరిష్కరించాలని ఎంపీ డా.బి.సత్యవతి కోరారు. 


Similar News