వర్రా రవీంద్రారెడ్డి విషయంలో దూకుడు.. ఎస్పీగా విద్యాసాగర్‌కు అదనపు బాధ్యతలు

వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీంద్రారెడ్డి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు...

Update: 2024-11-07 17:05 GMT
వర్రా రవీంద్రారెడ్డి విషయంలో దూకుడు.. ఎస్పీగా విద్యాసాగర్‌కు అదనపు బాధ్యతలు
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీంద్రారెడ్డి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హోంమంత్రి వంగలపూడి అనితతో పాటు పలువురు మహిళలపై అసభ్య పోస్టులు పెట్టడంతో ఆయనపై కేసు నమోదు అయింది. దీంతో పోలీసులు అదుపులోకి తీసుకునే క్రమంలో ఆయన పారిపోయారు. అయితే విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన కడప జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజును ప్రభుత్వం బదిలీ చేసింది. దీంతో ఈ  బాధ్యతలను విద్యాసాగర్‌‌నాయుడుకు అప్పగించారు. ఈ మేరకు విద్యాసాగర్ నాయుడు ఆధ్వర్యంలో వర్రా రవీంద్రారెడ్డి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. వర్రా రవీందర్ రెడ్డి కుటుం సభ్యులు ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వర్రా రవీంద్రారెడ్డిని త్వరలోనే పట్టుకుంటామని ఎస్పీ విద్యాసాగర్ తెలిపారు.


Similar News