30 ఏళ్ల క్రితమే ప్రమోట్ చేశా: సంబేపల్లిలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
అన్నమయ్య జిల్లా సంబేపల్లిలో సీఎం చంద్రబాబు నాయుడు లబ్ధిదారులకు పింఛన్ అందజేశారు...

దిశ, వెబ్ డెస్క్: అన్నమయ్య జిల్లా సంబేపల్లి(Sambepalli)లో సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu) పర్యటించారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్(NTR Bharosa Pension) డోర్ టూ డోర్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు పింఛన్ పంపిణీ చేశారు. మోటుకట్ల(Motukatla)లో వృద్ధురాలి ఇంటికి వెళ్లి సీఎం చంద్రబాబు పింఛన్ అందించారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ 30 ఏళ్ల క్రితం తాను IT ని ప్రమోట్ చేసినట్లు తెలిపారు. అప్పుడు IT అంటే ఎవరికీ తెలియదని చెప్పారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఫ్యూచర్ అని ఆ రోజుల్లోనే ఊహించానని తెలిపారు. అంతేకాదు ఐపీపై శ్రద్ధ పెడితే మొదట్లో ఎవరికీ అర్థం కాలేదన్నారు. హైదరాబాద్(Hyderabad)లో హైటెక్ టవర్స్ కట్టాలంటే చాలా కష్టపడ్డానని గుర్తు చేశారు. హైటెక్ టవర్స్‌ని చూసి తమకు కూడా IT ఉద్యోగం చేయాలనే కోరిక పుట్టిందని విద్యార్థులు తనకు చెప్పినట్లు స్పష్టం చేశారు. 30 ఇంజనీరింగ్ కాలేజీలను 9 ఏళ్లలో 300 ఇంజనీరింగ్ కాలేజీలను చేశామని చంద్రబాబు పేర్కొన్నారు.
‘‘హైదరాబాద్‌లో అడుగడుగునా నా కృషి ఉంది. ప్రస్తుతం హైదరాబాద్ మోస్ట్ లివబుల్ సిటీగా ఉంది. హైటెక్ సిటీ, సైబరాబాద్ నామకరణం నేనే చేశా. భయం అనేది నా జీవితంలోనే లేదు. నన్ను 53 రోజులు జైల్లో పెట్టారు. అప్పుడు 80 దేశాల్లో మనోళ్లు రోడ్డుమీదకు వచ్చి నిరసనలు చేశారు. 100 దేశాల్లో మన పిల్లలు ఉన్నారు.’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.