పరిటాల శ్రీరామ్‌పై అనుచిత వ్యాఖ్యలు.. వైసీపీ నాయకుడు హరికృష్ణారెడ్డి అరెస్ట్
పరిటాళ శ్రీరామ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో వైసీపీ నాయకుడు హరికృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ..
దిశ, వెబ్ డెస్క్: పరిటాల శ్రీరామ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో వైసీపీ నాయకుడు హరికృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో కళ్లం హరికృష్ణారెడ్డి రెచ్చిపోయారు. టీడీపీ నాయకులపై అసభ్య పోస్టులు పెట్టారు. గుంటూరు జిల్లాకు చెందిన హరికృష్ణారెడ్డి అనంతపురం జిల్లా రాప్తాడుకు వెళ్లి పరిటాల శ్రీరామ్‌పై తొడగొట్టి నీ అంతు చూస్తానంటూ సవాల్ చేశారు. అయితే ఆ సమయంలో పరిటాల శ్రీరామ్ ఫిర్యాదును పోలీసులు పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో గుంటూరు లాలాపేటలో హరికృష్ణారెడ్డిపై ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా హరికృష్ణారెడ్డిని అరెస్ట్ చేశారు.