స్పీకర్ సార్.. అది కుదరదు: న్యాయవాది మోహన్ రావు

ఫిరాయింపుల పిటిషన్‌ను ఐదు సంవత్సరాల పాటు సాగిదిస్తామంటే కుదురదని న్యాయివాది గండ్ర మోహన్ రావు అన్నారు...

Update: 2024-11-07 15:46 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ఫిరాయింపుల పిటిషన్‌ను ఐదు సంవత్సరాల పాటు సాగిదిస్తామంటే కుదురదని న్యాయివాది గండ్ర మోహన్ రావు అన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో హైకోర్టు వాదనలు కొనసాగుతుండగా ఆ కేసు విచారణ శుక్రవారానికి వాయిదా పడింది. గురువారం ఫిరాయింపుదారులపై చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదుదారులు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద తరుఫున సీనియర్ న్యాయవాది గండ్ర మోహన్ రావు వాదనలు వినిపించారు. స్పీకర్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ విచారణకు మందు, విచారణ తరువాత కూడా న్యాయ సమీక్షకు అధికారం ఉందని మోహన్ రావు తన వాదనల్లో వినిపించారు. స్పీకర్ అనర్హత పిటిషన్‌ను తన వద్దే ఐదు సంవత్సరాలు ఉంచుకుంటా అంటే కుదురదని ఆయన తన వాదనల్లో తెలిపారు. స్పీకర్ నిర్ణయానికి ముందు, తరువాత కోర్టులు జోక్యం చేసుకోవచ్చన్నారు. పార్టీ ఫిరాయించిన వారిని అనర్హులుగా ప్రకటించాలని కోరారు.


Similar News