Palnadu: ఐసీఐసీఐ బ్యాంకులో మోసం.. ఎట్టకేలకు ప్రధాన నిందితుడు అరెస్ట్
పల్నాడు జిల్లాలోని పలు ఐసీఐసీఐ బ్యాంకుల్లో డబ్బులు గోల్మాల్ చేసిన కేసులో ప్రధాన నిందితుడు నరేశ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు....
దిశ, వెబ్ డెస్క్: పల్నాడు జిల్లాలోని పలు ఐసీఐసీఐ బ్యాంకుల్లో డబ్బులు గోల్మాల్ చేసిన కేసులో ప్రధాన నిందితుడు నరేశ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. చిలకలూరిపేట, నరసరావుపేట, విజయవాడ ఐసీఐసీఐ బ్యాంకు బ్రాంచుల్లో గతంలో నరేశ్ మేనేజర్‌గా పని చేశారు. అయితే ఖాతాదారులు డిపాజిట్ చేసిన డబ్బులను మళ్లించారు. విషయం బయటకు రావడంతో పారిపోయారు. దీంతో సీఐడీ పోలీసులకు జోనల్ మేనేజర్ సందీప్ మెహ్రా ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన సీఐడీ పోలీసులు ఎట్టకేలకు నరేశ్‌ను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశ పెట్టారు. దీంతో నరేశ్‌కు జడ్జి 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. ఈ మేరకు నరేశ్‌ను పోలీసులు జైలుకు తరలించారు.