ఐదేళ్ల వైరానికి పుల్‌స్టాప్.. ఎన్నికల వేళ ఒక్కటైన ఇద్దరు కీలక నేతలు
ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఐదు సంవత్సరాల సుదీర్ఘ వైరానికి ఇద్దరు కీలక నేతలు పుల్‌స్టాప్ పెట్టారు.
దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఐదు సంవత్సరాల సుదీర్ఘ వైరానికి ఇద్దరు కీలక నేతలు పుల్‌స్టాప్ పెట్టారు. అందరికీ టిస్టు ఇస్తూ పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల వేళ కేఏ నాయుడు, కరణం శివరామకృష్ణ ఒక్కటయ్యారు. టీడీపీలో టికెట్ దక్కకపోవడంతో ఐదేళ్లుగా రెండు వర్గాలుగా ఉంటూ టికెట్ కోసం తలపడ్డ ఇద్దరు నేతలు పగను పక్కనబెట్టి కలిసిపోయారు. మంగళవారం ఇరు వర్గాల నేతలు, కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. అయితే, వీరిద్దరికి కాకుండా గణపతినగరం టికెట్‌ను కొండపల్లి శ్రీనివాసరావుకు చంద్రబాబు కేటాయించిన విషయం తెలిసిందే. దీంతో కేఏ నాయుడు, కరణం శివరామకృష్ణ అసంతృప్తి వ్యక్తం చేశారు. త్వరలోనే చంద్రబాబును కలిసి తమలో ఒకరికి టికెట్ ఇవ్వాలని.. ఎవరికి ఇచ్చినా కలిసి పనిచేస్తామని చెప్పాలని నిర్ణయించుకున్నారు. తమకు కాకపోయినా కరణం శివరామకృష్ణకైనా టికెట్ ఇప్పించాలని ఏకే నాయుడు సిద్ధమయ్యారు.