Srisailam:ఆ ఆలయంలో మద్యం తాగి విధులకు హాజరైన ఉద్యోగి.. పట్టుకుని చితకబాదిన భక్తులు
ఆంధ్రప్రదేశ్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఎంతో పవిత్రంగా భావించే ఆలయంలోకి ఒక వ్యక్తి మద్యం తాగి వచ్చాడు.
దిశ,వెబ్‌డెస్క్:ఆంధ్రప్రదేశ్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఎంతో పవిత్రంగా భావించే ఆలయంలోకి ఒక వ్యక్తి మద్యం తాగి వచ్చాడు. దీంతో అక్కడ ఉన్న భక్తులు ఇబ్బందిగా ఫీల్ అవుతూ..ఒక్కసారిగా అతనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే..శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి కొలువైన శ్రీశైలంలో అపచారం జరిగింది. గురువారం రాత్రి 9 గంటల సమయంలో క్యూ కంపార్ట్‌మెంట్ వద్ద ఓ ఉద్యోగి మద్యం తాగి విధులకు హాజరు కావడంతో భక్తులు మండిపడ్డారు. కోపంతో ఊగిపోతూ అతన్ని పట్టుకుని చితకబాదారు.
ఉద్యోగికి దేహశుద్ధి చేసిన అనంతరం భక్తులు ఆలయ క్యూ వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఆందోళనపై సమాచారం అందుకున్న సహాయ కార్యనిర్వాహక అధికారి జి.స్వాములు అక్కడికి చేరుకుని భక్తులకు సర్ది చెప్పేందుకు ప్రయత్నించారు. అయిన భక్తులు వినిపించుకోకుండా..సిబ్బంది మద్యం తాగి విధులకు వస్తుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఆలయ పవిత్రతను కాపాడడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.