Ambati Rambabu: కూకటివేళ్లతో కూటమిని ప్రజలు పెకలించడం ఖాయం.. మాజీ మంత్రి అంబటి ఘాటు వ్యాఖ్యలు
త్వరలోనే రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వాన్ని ప్రజలకు కూకటివెళ్లతో పెకలించడం ఖాయమని మాజీ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) ఘాటు వ్యాఖ్యలు చేశారు.
దిశ, వెబ్‌డెస్క్: త్వరలోనే రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వాన్ని ప్రజలకు కూకటివెళ్లతో పెకలించడం ఖాయమని మాజీ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇటీవల బాలికపై జరిగిన అత్యాచార ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Deputy CM Pawan Kalyan) కీలక వ్యాఖ్యలు చేశారు. హోంమంత్రి వంగలపూడి అనితను (Home Minister Anitha) ఉద్దేశించి తానే హోంమంత్రిని అయితే.. పరిస్థితి వేరేలా ఉంటుందని కామెంట్ చేశారు. ఈ క్రమంలో పవన్ (Pavan) వ్యాఖ్యలపై మాజీ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) సెటైర్లు వేశారు.
‘పవన్ నువ్వు హోంమంత్రి అవ్వు.. సీఎం కూడా అవ్వు’ అంటూ ఎద్దేవా చేశారు. ఆనాడు ఇందిరా గాంధీ లాంటి నాయకురాలికే ఓటిమి తప్పలేదని.. ప్రజలు తలుచుకుంటే కూటమిని కూకటివేళ్లతో పెకలించడం ఖాయమని అన్నారు. డిప్యూటీ సీఎంగా పవన్ (Pavan) ఆవేశంగా మాట్లాడితే.. ఏమి జరగదని ఫైర్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్ర హోంమంత్రి (Home Minister) పేరుకు, మైకుల ముందు మాత్రమే మంత్రి అని.. పోలీసులను ట్రాన్స్‌ఫర్ (Transfers) చేసే అధికారం ఆమెకు లేదని కామెంట్ చేశారు. ప్రాయశ్చిత్త దీక్షలు చేస్తే లా అండ్ ఆర్డర్ (Law & Order) కంట్రోల్ కాదని అంబటి సెటైర్లు వేశారు.