Ambati Rambabu: వివాదంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు.. ఈ సారి విషయం ఏంటంటే?
అంబటి రాంబాబు (Ambati Rambabu).. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో (Andhra Pradesh) వివాదాలకు కేరాఫ్ అడ్రస్. ఆయన ఏది చేసినా సంచలనమే.
దిశ, వెబ్‌డెస్క్: అంబటి రాంబాబు (Ambati Rambabu).. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో (Andhra Pradesh) వివాదాలకు కేరాఫ్ అడ్రస్. ఆయన ఏది చేసినా సంచలనమే. భోగి పండుగకు రికార్డింగ్ డ్యాన్స్‌లు వేయడం.. పక్క పార్టీల నాయకులపై ప్రెస్‌మీట్‌లు పెట్టి చీల్చిచెండాడటం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఈ క్రమంలోనే ఆయన మరో వివాదంలో చిక్కుకున్నారు. తాజాగా, ఆయన తిరుమల (Tirumala) శ్రీవారిని దర్శించుకున్నారు.
అయితే, ఆయన వెసుకున్న చొక్కాపై వైసీపీ (YCP) అధినేత వైఎస్ జగన్ (YS Jagan) స్టిక్కర్ ఉండటం ప్రస్తుతం వివాదానికి దారి తీసింది. రాజకీయ పార్టీల జెండాలు, చిహ్నాలు, స్టిక్కర్లతో స్వామి వారి దర్శనానికి రావడం టీటీడీ (TTD) నిబంధనలకు విరుద్ధం. కాగా, అదే సమమంలో శ్రీవారి దర్శనానికి వచ్చిన అనకాపల్లి (Anakapally) బీజేపీ ఎంపీ సీఎం రమేష్ (CM Ramesh), అంబటి షర్ట్‌పై ఉన్న స్టిక్కర్ చూసి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. భగవంతుడిపై గౌరవం లేని, సంప్రదాయాలను పాటించని వారు ఎలా ఆలయానికి వస్తారని ఆయన అంబటిని ప్రశ్నించారు. దీంతో చేసేదేమి లేక అంబటి రాంబాబు సైలెంట్‌గా అక్కడి నుంచి వెళ్లిపోయారు.