Ambati Rambabu: కుట్రపూరితంగా జగన్‌పై నిందలేస్తున్నారు.. మాజీ మంత్రి అంబటి ఫైర్

కావాలనే కుట్రపూరితంగా వైఎస్ జగన్‌ (YS Jagan)పై నిందలేస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు (Former Minister Ambati Rambabu) ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు.

Update: 2024-09-22 09:07 GMT

దిశ, వెబ్‌డెస్క్: కావాలనే కుట్రపూరితంగా వైఎస్ జగన్‌ (YS Jagan)పై నిందలేస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు (Former Minister Ambati Rambabu) ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జగన్ ఇంటిపై దాడి చేసి బీజేపీ (BJP) ఆనందపడాలని చూస్తుందా అని ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్ (Steel Plant) విషయాన్ని డైవర్ట్ చేసేందుకే ఈ దాడులకు తెర లేపారని ఫైర్ అయ్యారు. బట్ట కాల్చి మీద వేయడం సరికాదని.. దమ్ముంటే నిరూపించాలని సవాల్ విసిరారు. కూటమి ప్రభుత్వంలో వచ్చిన రిపోర్టుతో జగన్‌(Jagan)కు ఏం సంబంధం ఉందని ప్రశ్నించారు. జగన్ మీద రాజకీయ కక్ష ఉంటే నేరుగా తేల్చుకునేందుకు రావాలని, అంతేగాని దేవుడిని అడ్డం పెట్టుకుని రాజకీయం చేయడం ఏంటని ప్రశ్నించారు. బీజేపీ అనుబంధ సంఘాల నాయకులు జగన్ ఇల్లు, పార్టీ ఆఫీస్‌పై దాడి చేసేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. ఈ విషయాన్ని ప్రజాస్వామ్య వాదులంతా ఖండించాలని అంబటి పిలుపునిచ్చారు. తిరుమల లడ్డూపై సీఎం చంద్రబాబు (CM Chandrababu) రాజకీయం చేసేందుకు ప్రయత్నింస్తున్నారని ఆరోపించారు. జూన్ నెలలో వచ్చి రిపోర్టును పట్టుకుని జగన్ మీద కుట్రపూరితంగా నిందలు వేయడం సరికాదని అంబటి హితవు పలికారు.


Similar News