Ambati: అల్లుడి వీడియోపై క్లారిటీ ఇచ్చిన మంత్రి అంబటి.. అతడి వెనుక ఆయనే ఉన్నడంటూ సంచలన ఆరోపణ

రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థుల ప్రచారం ఊపందుకుంది. పోలింగ్‌‌కు మరికొద్ది రోజుల సమయం ఉండటంతో ఆయా పార్టీల నేతలు నియోజకవర్గాల్లో జోరుగా పర్యటిస్తున్నారు.

Update: 2024-05-05 14:16 GMT

దిశ, వెబ్‌డెస్క్: సార్వత్రిక ఎన్నికల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థుల ప్రచారం ఊపందుకుంది. పోలింగ్‌‌కు మరికొద్ది రోజుల సమయం ఉండటంతో ఆయా పార్టీల నేతలు నియోజకవర్గాల్లో జోరుగా పర్యటిస్తున్నారు. గడపగడపకు వెళ్లి తమకు ఓటెయ్యాలంటూ అభ్యర్థిస్తున్నారు. ఈ క్రమంలోనే మంత్రి అంబటి రాంబాబుకు చుక్కెదురైంది. ఆయన అల్లుడు డాక్టర్ గౌతమ్, అంబటి రాంబాబు‌కు ఓటు వేయకండి అంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట్లో విపరీతంగా వైరల్ అవుతోంది. అయితే, ఆ వీడియోలో గౌతమ్, మామ అంబటిని దుర్మార్గుడు, దుష్టుడితో పోల్చాడు. అయితే, అదే విషయాన్ని ఎన్నికల ప్రచారంలో భాగంగా అంబటిపై సెటైర్లు వేస్తూ.. ఇటీవల పవన్ కల్యాణ్ పొన్నూరు సభలో ప్రస్తావించారు. దీంతో అంబటి ఇవాళ ఆ వీడియో గురించి వివరణ ఇచ్చేందుకు ప్రెస్ మీట్ పెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనకు ఓటు వేయొద్దని అల్లుడు గౌతమ్ చెప్పాడని.. ఆ వ్యాఖ్యలను తాను పట్టించుకోనని అన్నారు. తన కూతురు, అల్లుడు రాజకీయ నాయకులు కారని.. ఇద్దరూ వైద్యులేనని తెలిపారు. వారిద్దరూ త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం అదే ప్రక్రియ కొనసాగుతోందని క్లారిటీ ఇచ్చారు. ఇవాళ నా అల్లుడు మాత్రమే మాట్లాడితే నేను అసలు మాట్లాడే వాడిని కాదని.. ఆయన మాటల వెనుక పవన్ కల్యాణ్ ఉన్నాడంటూ సంచలన ఆరోపణలు చేశారు.   

Tags:    

Similar News