సుప్రీంకోర్టుకు అమరావతి రైతులు

అమరావతి రైతులు మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

Update: 2023-04-06 07:31 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : అమరావతి రైతులు మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆర్-5 జోన్ వ్యవహారంపై రైతుల పిటిషన్ దాఖలు చేశారు.సీజేఐ ధర్మాసనం ఎదుట ఈ పిటిషన్‌ను న్యాయవాది శేషాద్రినాయుడు ప్రత్యేకంగా ప్రస్తావించారు. అయితే ఈనెల 14న విచారణ చేపడతామని సుప్రీంకోర్టు ధర్మాసనం వెల్లడించింది. ఈ నెల 10న విచారణకు తీసుకోవాలని కోరిన రైతుల తరపు న్యాయవాది కోరారు.ఈనెల10 నాటి కేసుల జాబితా ఇప్పటికే తయారైందని సీజేఐ ధర్మాసనం తెలిపింది. ఈనెల 14న విచారణకు తీసుకుంటామని సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్ స్పష్టం చేశారు. తదుపరి విచారణను వాయిదా వేశారు. ఇకపోతే ఆంధ్రప్రదేశ్‌ రాజధాని నిర్మాణం కోసం రైతుల నుంచి సమీకరించిన భూముల్లో పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయడంపై భూములు ఇచ్చిన రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.రాజధాని ప్రాంతంలో ఇతర ప్రాంతాలకు ఇవ్వడానికి వీల్లేదంటూ మండిపడుతున్నారు.రాజధాని ప్రాంతంలో ఆర్‌-5 జోన్‌ ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వం మార్చి 21న గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్‌ను సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టులో రైతులు పిటిషన్ దాఖలు చేయగా తాజాగా మరోసారి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

Tags:    

Similar News