ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయం: MLA

విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడం ఖాయమని జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-08-07 14:13 GMT

దిశ, వెబ్‌డెస్క్: విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడం ఖాయమని జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఓటమిని జీర్ణించుకోలేకనే వైసీపీ ఆరోపణలు చేస్తోందని విమర్శించారు. కాగా, గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన పలువురు వైసీపీ కార్పొరేటర్‌లు ఆ పార్టీకి షాక్ ఇచ్చి జనసేన పార్టీలో చేరిన విషయం తెలిసిందే. మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. తాజాగా బుధవారం గ్రేటర్‌ విశాఖ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (GVMC)లో కూటమి అభ్యర్థులు విజయం సాధించారు. విశాఖలో భారీ మెజార్టీ ఉన్నప్పటికీ వైసీపీ విజయం సాధించలేకపోయింది. 97 మంది కార్పొరేటర్లు ఉన్న జీవీఎంసీలో 10 వార్డులకు ఒకరు చొప్పున మొత్తం 10 మందిని స్టాండింగ్ కమిటీగా ఎన్నుకుంటారు. ఇందులో భాగంగా 10 స్థానాలను కూటమి కైవసం చేసుకోవడం వైసీపీకి తీరని షాక్‌ తగిలింది. ఈ పరిణామాలు ఎమ్మెల్సీ ఎన్నికలపై పడి వైసీపీ ఓడిపోయే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Tags:    

Similar News