అన్నదాతలకు అలర్ట్.. రైతు భరోసా నిధుల జమ పై బిగ్ అప్డేట్

ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధి పై ప్రత్యేక ఫోకస్ చేసింది.

Update: 2024-10-19 11:24 GMT

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధి పై ప్రత్యేక ఫోకస్ చేసింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను సీఎం చంద్రబాబు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు సర్కార్ సూపర్ సిక్స్ హామీల అమలుపై దృష్టి పెట్టింది. అయితే కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు క్యాలెండర్ సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. అయితే దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం ప్రారంభించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇక తల్లికి వందనం పై కూడా చర్చలు జరుగుతున్నాయి.

ఈ నేపథ్యంలో రైతులకు ఇచ్చిన హామీ మేరకు ‘అన్నదాత సుఖీభవ’ పథకం అమలు విషయంలో ప్రభుత్వం తాజాగా ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. వైసీపీ హయాంలో అమలు చేసిన ‘రైతు భరోసా’ పథకాన్ని కూటమి ప్రభుత్వం ‘అన్నదాత సుఖీభవ’ మార్చిన సంగతి తెలిసిందే. ఈ పథకం కింద నిధుల విడుదల ఎప్పుడు చేసే అవకాశం ఉంటుందనే దాని పై ప్రభుత్వంలో చర్చ మొదలైంది. ఆర్థిక శాఖ కసరత్తు అనంతరం ప్రస్తుత సంవత్సరంలో ఈ పథకం అమలు సాధ్యపడదనే అంశం స్పష్టం అవుతోంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలోనే ఈ పథకం అమలు కానుందని సమాచారం.

ఈ ఏడాది లేనట్లే..?

అయితే.. 2024-25 పూర్తి స్థాయి బడ్జెట్‌ను నవంబర్‌లో ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది. ఈ బడ్జెట్‌లో ‘అన్నదాత సుఖీభవ’ పథకం కోసం నిధులను ప్రస్తావన చేయకుండా.. పథకం హామీ పైనే మరోసారి స్పష్టత ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఉచిత గ్యాస్‌ సిలిండర్లు, విద్యార్థుల ఫీజులకు 'తల్లికి వందనం', నిరుద్యోగ భృతి వంటి హామీల అమలుపై దృష్టి పెట్టిన కూటమి సర్కార్.. రైతులకు ఆర్థిక సాయం అందించే అన్నదాత సుఖీభవ మాత్రం వచ్చే ఆర్థిక సంవత్సరంలో అమలు చేసేలా ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.

Tags:    

Similar News