Tirumala : తిరుమల భక్తులకు అలర్ట్..భారీ వర్షాల ఎఫెక్ట్
తిరుమల(Tirumala)లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో శ్రీవారి మెట్టు మార్గం మూసివేస్తూ టీటీడీ(TTD) నిర్ణయం తీసుకుంది.
దిశ, వెబ్ డెస్క్ : తిరుమల(Tirumala)లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో శ్రీవారి మెట్టు మార్గం మూసివేస్తూ టీటీడీ(TTD) నిర్ణయం తీసుకుంది. భారీ వర్షాలకు తిరుమల రెండవ ఘాట్ లోని 12 వ మలుపు వద్ద రోడ్డుపై చెట్లు విరిగిపడి బండరాళ్లు అడ్డం పడ్డాయి. దీంతో తిరుమలకు వెళ్ళే వాహనాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రంగంలోకి దిగిన టీటీడీ సిబ్బంది రోడ్డుకు అడ్డంగా పడ్డ బండరాలను చెట్లను తొలగించే చర్యలు చేపట్టారు. జేసీబీల సహాయంతో వాటిని తొలగించి రాకపోకలు పునరుద్ధరించే పనులు కొనసాగిస్తున్నారు.
ఫెయింజల్ తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న వర్షాలతో తిరుమలలోని కపిల తీర్ధం, అకాశ గంగ తిరుమల గిరుల్లోని జలపాతాలు వరద నీటితో హోరెత్తుతున్నాయి. పాపవినాశనం, ఆకాశగంగ, గోగర్భం, కుమారధార, పసుపుధార జలాశయాలన్ని పూర్తిగా నిండిపోగా, గోగర్భం జలాశయం గేట్లు ఎత్తి దిగువను నీటిని విడుదల చేస్తున్నారు.