విజయదశమి నుంచే విశాఖ నుంచి పరిపాలన: YS Jagan Mohan Reddy

విశాఖపట్నం కేంద్రంగా పరిపాలన ఎప్పటి నుంచి ప్రారంభించబోతుందో అనేదానిపై సీఎం వైఎస్ జగన్ కీలక ప్రకటన చేశారు.

Update: 2023-09-20 08:03 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : విశాఖపట్నం కేంద్రంగా పరిపాలన ఎప్పటి నుంచి ప్రారంభించబోతుందో అనేదానిపై సీఎం వైఎస్ జగన్ కీలక ప్రకటన చేశారు. దసరా నుంచి విశాఖ కేంద్రంగా పాలన జరగబోతుంది అని తెలిపారు. ఇందుకు సిద్ధంగా ఉండాలని మంత్రులు, ఉన్నతాధికారులను సీఎం వైఎస్ జగన్ సన్నద్ధం చేశారు. ఏపీ కేబినెట్ సమావేశంలో విశాఖ నుంచి పరిపాలన ఎప్పుడు ప్రారంభం అవుతుందని పలువురు అడిగారు. ఈ అంశంపై ప్రజల్లో సైతం విస్తృతంగా చర్చ జరుగుతుందని తొందరగా నిర్ణయం తీసుకుంటే మంచిదని అభిప్రాయం వెల్లడించారు. దీనిపై సీఎం వైఎస్ జగన్ స్పందించారు. విజయదశమి నుంచి విశాఖ నుంచే పరిపాలన ఉంటుందని చెప్పుకొచ్చారు. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర భవనాల ఎంపిక విషయంలో కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కమిటీ సూచనల మేరకు కార్యాలయాల తరలింపు ఉంటుందని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. మరోవైపు జమిలీ ఎన్నికలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముందస్తు, జమిలీ ఎన్నికలపై ఆసక్తికరంగా స్పందించారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం ప్రకారం ముందుకు వెళ్తాం అని ప్రకటించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పోటీ చేసేందుకు వైసీపీ సిద్ధంగా ఉందని సీఎం వైఎస్ జగన్ కేబినెట్ సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు.

Tags:    

Similar News