భార్య రాసలీలలు.. రెండు రాష్ట్రాల పోలీసులు ఉరుకులు, పరుగులు.. చివరికి నీలగిరి తోపులో..

కోరుకున్న ప్రియుడి కోసం కట్టుకున్న భర్తనే కడతేర్చింది ఓ ఇల్లాలు.

Update: 2023-05-06 14:12 GMT

దిశ, చిత్తూరు : కోరుకున్న ప్రియుడి కోసం కట్టుకున్న భర్తనే కడతేర్చింది ఓ ఇల్లాలు. కలిసి ఏడడుగులు వేసిన భర్త కంటే అక్రమ సంబంధం పెట్టుకున్న ప్రియుడే ఎక్కువ అనుకుందేమో.. తన రాసలీలలకు అడ్డుగా ఉన్నాడని మట్టుబెట్టించింది. భర్త మద్యం తాగే విక్‌నెస్‌ను ఆసరాగా తీసుకుని అంతమొందించారు. మిస్సింగ్ కేసు ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు కేసును ఛేదించి వివరాలను వెల్లడించారు. వారి కథనం ప్రకారం..

చిత్తూరు జిల్లా వేమూరు గ్రామానికి చెందిన తిమ్మప్ప (40), ఆయన భార్య విజయమ్మ (30) కూలీ పనులు చేసుకోని జీవిస్తున్నారు. ఈ క్రమంలో జీవనోపాధి కోసం బెంగళూరులోని మహదేవపురకు వలస వెళ్లారు. అక్కడ తిమ్మప్పకు తమిళనాడుకు చెందిన పెరుమాళ్ పరిచయమయ్యాడు. వీరి స్నేహం కొనసాగుతున్న క్రమంలోనే తిమ్మప్ప భార్య విజయమ్మకు పెరుమాళ్‌తో వివాహేతర సంబంధం ఏర్పడింది. దీంతో సమయం దొరికినప్పుడల్లా ప్రియుడితో కలిసి విజయమ్మ ఎంజాయ్ చేసేది. అయితే భర్త తిమ్మప్ప వల్ల వారి రాసలీలలకు ఇబ్బందిగా మారింది.

దీంతో అతడిని అడ్డు తొలగించుకోవాలని విజయమ్మ ప్రియుడుతో కలిసి మాస్టర్ ప్లాన్ రచించింది. దీనిలో భాగంగా ఏప్రిల్ 27న ప్రియుడు పెరుమాళ్, అతని స్నేహితుడు వెంకట చలపతిలు కలిసి తిమ్మప్పను బార్‌కు తీసుకువెళ్లారు. అక్కడ మద్యంలో విషం కలిపి అతడికి తాగించారు. అది తెలియని తిమ్మప్ప దానిని సేవించి మృతి చెందాడు. తిమ్మప్ప మృతదేహాన్ని టెంపో లో వేసుకుని మాలూరు తాలూకాలోని ఇరబనహాళ్లి గేట్ సమీపంలో ఉండే చిత్తూరు జిల్లాలోని కుప్పం మండలం నీలగిరి తోపులో పడేశారు.

అయితే తన అన్న మూడు రోజులుగా కనిపించకపోడంతో తిమ్మప్ప సహోదరుడు మే1న మహాదేవపుర పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు పెట్టాడు. దర్యాప్తు చేపట్టి పోలీసులకు శనివారం ఉదయం నీలగిరి తోపులో మృతదేహం ఉన్నట్లు సమాచారం అందింది. ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు మృతదేహం తిమ్మప్పదిగా గుర్తించారు. వెంటనే డెడ్ బాడీని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్ట్ మార్టం నిర్వహించగా హత్యగా తేలింది. దీంతో పోలీసులు హతుడి భార్య విజయమ్మను పోలీస్ స్టేషన్‌కు తరలించి ఆమె మొబైల్ కాల్ లిస్ట్ ఆధారంగా విచారణ చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

తానే తన భర్తను హత్య చేయించినట్లు తెలిపింది. విజయమ్మతోపాటు పెరుమాళ్, వెంకటా చలపతిలను పోలీసులు అరెస్టు చేశారు. మిస్సింగ్ కేసులో చాకచక్యంగా వ్యవహరించి హత్య కేసును ఛేదించిన మాలూరు పోలీసులను ఎస్పీ నారాయణ అభినందించారు. కాగా, ఈ కేసులో రెండు రాష్ట్రాల పోలీసులు ఉరుకులు. పరుగులు పెట్టారు. హత్య జరిగింది కర్ణాటక రాష్ట్రంలో అయినా.. మృతదేహం మాత్రం ఏపీలోని కుప్పం మండలంలో లభ్యమైంది. దీంతో ఈ కేసును రెండు రాష్ట్రాల పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News