నన్ను కాదని వాడికి టికెట్ ఇచ్చేదేంది రా బై.. పెట్రోల్ డబ్బాతో నిరసన

రానున్న ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కాయి.

Update: 2024-02-26 06:10 GMT

దిశ డైనమిక్ బ్యూరో: రానున్న ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కాయి. ముఖ్యంగా టీడీపీ, జనసేన పొత్తు ఇరుపార్టీల్లో చిచ్చుపెడుతోంది. జనసేన పార్టీకి టీడీపీ ఫిస్ట్ లిస్ట్ లో 24 సీట్లు ఇచ్చింది. దీనితో పార్టీ నేతల్లో కార్యకర్తల్లో అసంతృప్తి నెలకొంది. ఇది ఇలా ఉంటె.. మరో వైపు అన్నమయ్య జిల్లా లోని తంబాలపల్లి నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి గొల్లశంకర్ యాదవ్ అనుచరులు చంద్రబాబు ఇంటి వద్ద పెట్రోల్ డబ్బాలతో నిరసన చేపట్టారు.

వివరాల్లోకి వెళ్తే టీడీపీ అధిష్టానం రానున్న ఎన్నికల్లో పోటీ చేసందుకు గొల్లశంకర్ యాదవ్ కి టికెట్ ఇవ్వలేదు. వైసీపీ నుండి టీడీపీలోకి వచ్చిన దాసరి పల్లె జయచంద్రారెడ్డి కి టికెట్ ఇస్తూ.. తంబాలపల్లి నియోజకవర్గ అభ్యర్థిగా టీడీపీ అధిష్టానం ప్రకటించింది. దీనితో ఆగ్రహానికి లోనైనా గొల్లశంకర్ యాదవ్ అనుచరులు చంద్రబాబు ఇంటి వద్ద నిరసన చేపట్టారు.

జై శంకర్, ఉయ్ వాంట్ జస్టిస్ అనే అనే నినాదలు ఆ ప్రాంతమంతా మారుమోగాయి. ఈ నేపథ్యంలో గొల్లశంకర్ యాదవ్ అనుచరులు మాట్లాడుతూ చంద్రబాబు పై ఫైర్ అయ్యారు. ఐదేళ్లుగా పార్టీ కోసం పని చేస్తున్న వ్యక్తిని కాదని వైసీపీ నుండి వచ్చిన వ్యక్తికి ఎలా టికెట్ ఇస్తారని ప్రకటించారు. శంకర్ కి టికెట్ ఇవ్వకపోతే పెట్రోల్ పోసుకుని ఆత్మహుతి చేసుకుంటామని హెచ్చరించారు.

వాళ్ళతోపాటు తెచ్చుకున్న పెట్రోల్ డబ్బా మూవుతా తీసి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. 

Read More..

టికెట్ ఇవ్వని పవన్ కల్యాణ్.. కార్యకర్తల ముందే కన్నీరు పెట్టుకున్న బాబు..!  


Tags:    

Similar News