Breaking: తాడిపత్రిలో ఘోరం.. ఇద్దరు దుర్మరణం
అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం చుక్కలూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది...
దిశ, వెబ్ డెస్క్: అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం చుక్కలూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైకును ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరొక మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆమెను అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. స్థానికుల నుంచి ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలకు సమాచారం అందజేశారు. మృతుల మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. రోడ్డు ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ సభ్యులను దృష్టిలో ఉంచుకొని వాహనాలు నడిపాలని డ్రైవర్లకు సూచించారు. మద్యం తాగి అసలు డ్రైవింగ్ చేయొద్దని, రూల్స్ పాటించాలని చెప్పారు. నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.