అరుదైన ఒడిమీను.. భలే గిరాకీ?

విశాఖ మత్య్సకారుల వలకు అరుదైన ఒడిమీను చేప దొరికింది..

Update: 2024-03-10 13:31 GMT

దిశ, వెబ్ డెస్క్: విశాఖ మత్య్సకారుల వలకు అరుదైన ఒడిమీను చేప దొరికింది. పుడిమడకకు చెందిన మత్య్సకారుడు శనివారం రాత్రి సముద్రంలో వేటకు వెళ్లారు. అయితే ఆయన వలకు చాలా లావుగా ఉన్న నాలుగు అడుగుల పొడవున్న చేప చిక్కింది. ఈ చేపను కొండయ్య అనే మత్య్సకార వ్యాపారి కేజీ రూ.900 చెల్లించి కొనుగోలు చేశారు. అయితే ఈ చేపలో ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయని, అందువల్లే అంత డిమాండ్ ఉందని కొండయ్య తెలిపారు. కాగా సముద్రంలో సాధారణంగా 2 నుంచి 3 అడుగుల చేపలు తరచూ లభ్యమవుతాయని, ఇలాంటి నాలుగు అడుగుల చేప వలకు చిక్కడం చాలా అరుదని మత్య్సకారుడు తెలిపారు. మూడు అడుగులకు మించిన ఒడిమీను ఇప్పటి వరకూ దొరకలేదని.. ఇంతకంటే పెద్ద చేప దొరకడం ఇదే ఫస్ట్ టైమ్ అని మత్య్సకారుడు స్పష్టం చేశారు. 


Similar News