రాఘురామకృష్ణరాజు కస్టోడియల్‌ కేసులో కీలక పరిణామం

వైసీపీ ప్రభుత్వ హయాంలో.. ఆ పార్టీ ఎంపీగా ఉన్న రఘురామకృష్ణంరాజును అరెస్ట్ చేసి.. కస్టడీలో చిత్రహింసలకు గురి చేయడం అప్పట్లో సంచలనంగా మారింది.

Update: 2024-12-31 04:41 GMT

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ ప్రభుత్వ హయాంలో.. ఆ పార్టీ ఎంపీగా ఉన్న రఘురామకృష్ణంరాజును అరెస్ట్ చేసి.. కస్టడీలో చిత్రహింసలకు గురి చేయడం అప్పట్లో సంచలనంగా మారింది. ఈ ఘటనకు సంబంధించిన కేసు నమోదు కాగా.. తాజాగా రాఘురామకృష్ణరాజు కస్టోడియల్‌ కేసు(Custodial case)లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ ఏఎస్పీ విజయ్‌పాల్‌(Former ASP Vijaypal)కు సన్నిహితుడైన తులసిబాబు(Tulsi Babu) పేరును పలుమార్లు రఘురామకృష్ణరాజు(Raghuramakrishna Raja) విచారణలో తెలిపాడు. దీంతో.. గుడివాడకు చెందిన తులసి బాబుకు పోలీసుల నోటీసులు(Notices) ఇచ్చారు. విచారణకు రావాలని ఆయనకు నోటీసుల్లో ఎస్పీ తెలిపారు. కాగా కస్టోడియల్ కేసులో.. ఇప్పటికే పలువురు పోలీసులు, సీఐడీ(CID) అధికారులు..డాక్లర్లను విచారించారు. అయితే.. ఈ కేసులో ప్రైవేట్‌ వ్యక్తికి నోటీసులు జారీ ఇదే మొదటి సారి కావడం విశేషం.


Similar News